Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ పేపర్ పులి మాత్రమే.. మరోసారి విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత...

రాహుల్  బబ్బర్ షేర్ కాదు, పేపర్ పులి మాత్రమే అంటూ ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. 

Rahul is only a paper tiger MLC Kavita fires - bsb
Author
First Published Oct 21, 2023, 2:59 PM IST

జగిత్యాల : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత వరుస విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పై వాగ్భాణాలు విసురుతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ క్రమంలోనే  రాహుల్ బబ్బర్ షేర్ కాదని.. పేపర్ పులి మాత్రమే అంటూ.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు జగిత్యాల జిల్లా, మెట్పల్లిలో జరిగిన సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

తెలంగాణకు గాంధీ కుటుంబానికి మధ్య విద్రోహక సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ దీక్ష వల్లనే తెలంగాణ ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీవన్ రెడ్డి తన వయసు మరిచిపోయి, దిగజారి మాట్లాడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణి కార్మికులకు న్యాయం జరిగిందని  తెలిపారు. టిఆర్ఎస్ మేనిఫెస్టో బీడీ కార్మికులకు పనికొచ్చే విధంగానే ఉందన్నారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి చనిపోయిన వారికి ప్రభుత్వ బీమా వర్తిస్తుందని హామీ ఇచ్చారు.  రేషన్ కార్డులో గల్ఫ్ కు వెళ్లిన వారి పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించమని చెప్పుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios