Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ పేరుతో వేధింపులు... యువతికే కాదు ఆమె అన్నకు అసభ్య మెసేజ్‌లు

అతడు ఉన్నత చదువుల కోసం సొంత ఊరిని వదిలి హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ చదువుకుంటూ తన తోటి విద్యార్థినితో ఆకర్షణలో పడ్డాడు. అయితే ఆమె ప్రేమించడం లేదని తెలిసి సదరు యువకుడు ఉన్మాదిలా మారాడు. సోషల్ మీడియాలో అసభ్యకరమైనప మెసేజ్ లు, ఫోటోలతో యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన యువతి చివరికి పోలీసులను ఆశ్రయించడంతో యువకుడు కటకటాలపాలయ్యాడు. ఆ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

rachakonda police arrested a young boy in sexual harassment case
Author
Hyderabad, First Published Nov 29, 2018, 1:48 PM IST

అతడు ఉన్నత చదువుల కోసం సొంత ఊరిని వదిలి హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ చదువుకుంటూ తన తోటి విద్యార్థినితో ఆకర్షణలో పడ్డాడు. అయితే ఆమె ప్రేమించడం లేదని తెలిసి సదరు యువకుడు ఉన్మాదిలా మారాడు. సోషల్ మీడియాలో అసభ్యకరమైనప మెసేజ్ లు, ఫోటోలతో యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన యువతి చివరికి పోలీసులను ఆశ్రయించడంతో యువకుడు కటకటాలపాలయ్యాడు. ఆ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే....కడప జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన మచ్చు సిద్దగోపాల్ సీఏ కోచింగ్ కోసం హైదరాబాద్ కకు వచ్చాడు. మలక్ పేట ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్ లో 2016లో కోచింగ్ తీసుకున్నాడు. ఈ  క్రమంలో అదే బ్యాచ్ లో కోచింగ్ తీసుకుంటున్న ఓ యువతితో పరిచయం ఏర్పడింది. తనతో యువతి స్నేహంగా ఉండటంతో దాన్ని ప్రేమగా భావించాడు. 

కోచింగ్ ముగియగానే యువతి అతడిని కలవడం తగ్గించింది. దీంతో గోపాల్ నేరుగా యువతి ఇంటికి వెళ్లి తనను ప్రేమించాలంటూ యువతికి  వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం ఆ అమ్మాయి తన అన్నకు చెప్పడంతో అతడు గోపాల్ ను తీవ్రంగా హెచ్చరించి అక్కడి నుండి వెళ్లగొట్టాడు.

ఈ సంఘటనతో గోపాల్ యువతిపై మరింత కోపాన్ని పెంచుకున్నాడు. సదరు యువతితో పాటు ఆమె అన్న ఫోన్ నంబరు, సోషల్ మీడియా అకౌంట్ల సంపాదించి వాటి ద్వారా  వారికి అసభ్య, అశ్లీల మెసేజ్ పంపెవాడు. దీంతో వేధింపులను తట్టుకోలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాచకోండ పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios