ఓ కరుడుగట్టిన గజదొంగను రాచకొండ పోలీసులు (Rachakonda Police) అరెస్ట్ చేశారు. 16 ఏళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అతడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.
ఓ కరుడుగట్టిన గజదొంగను రాచకొండ పోలీసులు (Rachakonda Police) అరెస్ట్ చేశారు. 16 ఏళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అతడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అతడిని అరెస్ట్ చేశారు. వివరాలు.. రాసికుల్ ఖాన్ అనే వ్యక్తి తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తాళం ఉన్న ఇండ్లను రెక్కీ చేసి దోచుకునేవాడు. పోలీసులకు దొరకకుండా దొంగతనాలు చేసి.. అక్కడి నుంచి పరారయ్యేవాడు. 2006 నుండి పోలీసులకు దొరకుండా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతడు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 17 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు.
అతడిపై రాచకొండ పరిధిలోనే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల్లో దాదాపు 100 కేసులు ఉణ్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని పట్టుకోవడానికి రాచకొండ పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అతని ఆచూకీ కనుక్కోవడానికి కోసం 70వేల ఫోన్ నంబర్స్ సెర్చ్ చేశారు. చివరకు అతడిని రాచకొండ పోలీసులు.. పశ్చిమ బెంగాల్‌లో పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 52 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
రాసికుల్ ఖాన్‌పై కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఇక, సైకిల్‌పై తిరుగుతూ ఇళ్లని పరిశీలించే రాసికుల్ ఖాన్.. కరెక్ట్‌గా టైమ్ చూసి చోరీలకు పాల్పడేవాడు. పెద్ద సంఖ్యలో చోరీలకు పాల్పడిన గజదొంగ రాసికుల్ ఖాన్.. మోస్ట్ వాంటెడ్ దొంగగా మారాడు.
