Asianet News TeluguAsianet News Telugu

యువకుడి ప్రశ్నతో షాక్: నోరు మూసుకో అంటూ తిట్టిన కేసీఆర్

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ప్రసంగిస్తుండగా, ప్రేక్షకుల్లోంచి ఓ యువకుడు లేచి 12 శాతం మైనారిటీ కోటా అమైందంటూ ప్రశ్నించాడు.

Question on quota irks KCR, fires at youth
Author
Kagaznagar, First Published Nov 30, 2018, 10:56 AM IST

ఆసిఫాబాద్: ఓ యువకుడు వేసిన ప్రశ్నకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు సహనం కోల్పోయారు. అతన్ని తిట్టిపోశారు. 

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ప్రసంగిస్తుండగా, ప్రేక్షకుల్లోంచి ఓ యువకుడు లేచి 12 శాతం మైనారిటీ కోటా అమైందంటూ ప్రశ్నించాడు. 

దాంతో కేసీఆర్ సహనం కోల్పోయి "బాత్ కర్తే, బైఠో కామోష్ బైఠో. వోబీ బారాహ్ పర్సెంట్ హై బోలే కామోష్ బైఠో... బైఠ్ జావో (ఏం మాట్లాడుతున్నావు. నోరు మూసుకుని కూర్చో. ఆ 12 శాతం గురించే చెబుతున్నా. నోరు మూసుకుని కోర్చుండు)" అని అన్నారు. 

"నేను చెబుతా, ఎందుకు తొందరపడుతున్నావు" అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ యువకుడు కూర్చోకపోవడంతో... "నోరు మూసుకో. చప్పుడు చేయకుండా కూర్చో. మాటలు నీ బాపుకు చెప్పాలా? ఎందుకు తమాషా చేస్తున్నావు?" అని గద్దించారు. 

అతని వైపు కొంత మంది వాలంటీర్లు దూసుకుని వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని కేసీఆర్ ఆపేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios