Asianet News TeluguAsianet News Telugu

పెరుగుతున్న కేసులు: తెలంగాణలో క్వారంటైన్ సెంటర్లు రీ ఓపెన్, ప్రభుత్వం ఆదేశాలు

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో క్వారంటైన్ సెంటర్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

quarantine centres reopen in telangana ksp
Author
Hyderabad, First Published Apr 3, 2021, 6:41 PM IST

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో క్వారంటైన్ సెంటర్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లో క్వారంటైన్ సెంటర్‌ను సందర్శించారు కలెక్టర్ శ్వేతా మహంతి. అలాగే క్వారంటైన్ సెంటర్లు తిరిగి ప్రారంభించాలని కలెక్టర్లను ఆదేశించింది. 

మరోవైపు తెలంగాణపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1078 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

వైరస్‌ కారణంగా ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1712కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ శనివారం బులెటిన్ విడుదల చేసింది.

తాజాగా 331 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 6900 యాక్టివ్‌ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని, 3,116 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 283 ఉన్నాయి. శుక్రవారం 59,705 కొవిడ్‌ టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

 

quarantine centres reopen in telangana ksp

Follow Us:
Download App:
  • android
  • ios