పట్టణాలు, నగరాల్లోని ప్రజలకు అందుతున్న ఆధునిక వైద్య సేవలు గ్రామాల్లోని జనానికి అందాలని ఆకాంక్షించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఇవాళ ఆయన కరీంనగర్‌లో పర్యటించారు. నగరంలోని ప్రతిమా వైద్య కళాశాలలో సెంటర్ ఫర్ ఎక్స‌లెన్స్ కేంద్రాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. 

అనంతరం రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ.. చారిత్రక నేపథ్యం గల కరీంనగర్‌కు రావడం ఇదే ప్రథమమన్నారు. వైద్య రంగంలో దేశం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. మెడికల్ టూరిజంలో భారత్ మంచి గుర్తింపును పొందుతోందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా భారతీయ వైద్య నిపుణులకు మంచి పేరుందని రాష్ట్రపతి కొనియాడారు. పోలియో, స్మాల్ ఫాక్స్ వంటి వ్యాధులను విజయవంతంగా నిర్మూలించామని.. కానీ చిన్నారులను రక్తహీనత సమస్య బాధిస్తోందని రామ్‌నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. తలసేమియా బాధితుల విషయంలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉండటం దురదృష్టకరమన్నారు.

పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, వైద్యులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలకు ఒక వరమని, దీని వల్ల లక్షలాది పేదలకు ఉచిత వైద్యం అందనుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.