భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు (ramanujacharyulu) నిర్దేశించారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) అన్నారు. భక్తితో ముక్తి లభిస్తుందని వెయ్యేళ్ల క్రితమే రామానుజులు నిరూపించారని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమంలో (chinna jeeyar swamy) ఆదివారం రామానుజ సహస్రాబ్దీ సమారోహం వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. 

భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు (ramanujacharyulu) నిర్దేశించారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) అన్నారు. ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమంలో (chinna jeeyar swamy) ఆదివారం రామానుజ సహస్రాబ్దీ సమారోహం వేడుకల్లో (ramanuja sahasrabdi samaroham) ఆయన పాల్లోన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. భక్తితో ముక్తి లభిస్తుందని వెయ్యేళ్ల క్రితమే రామానుజులు నిరూపించారని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. 

అంతకు ముందు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌కు బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంగా హెలికాప్టర్‌ ద్వారా రాష్ట్రపతి సమతామూర్తిని తిలకించారు. అనంతరం ఆశ్రమం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు చినజీయర్‌ స్వామి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సమతామూర్తి కేంద్రంలోని 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సందర్శించారు. ఆపై దివ్యక్షేత్రంలోని 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నారు. ఆ తర్వాత భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువై ఉన్న 120 కిలోల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. రామ్‌నాథ్ కోవింద్ వెంట గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.