భగవత్ రామానుజుల సహస్రాబ్ధి సమారోహం కార్యక్రమంలో (ramanuja sahasrabdi samaroham) పాల్గొనేందుకు గాను ముచ్చింతల్‌లోని (muchintal) చినజీయర్ స్వామి ఆశ్రమానికి (chinna jeeyar swamy) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) చేరుకున్నారు.
భగవత్ రామానుజుల సహస్రాబ్ధి సమారోహం కార్యక్రమంలో (ramanuja sahasrabdi samaroham) పాల్గొనేందుకు గాను ముచ్చింతల్‌లోని (muchintal) చినజీయర్ స్వామి ఆశ్రమానికి (chinna jeeyar swamy) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ సమతామూర్తి కేంద్రం (samantha murthy statue) , ఆలయాలు, బృహన్‌మూర్తి విగ్రహాన్ని ఆయన సందర్శించనున్నారు.
అనంతరం రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించనున్నారు. రామానుజుల స్వర్ణమూర్తిని 120 కిలోల బంగారంతో రూపొందించారు. సమతామూర్తి కేంద్రంలోని భద్రవేది మొదటి అంతస్తులో 54 అడుగుల ఎత్తున దీన్ని నిర్మించారు. అంతకుముందు ఆదివారం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఘనస్వాగతం పలికారు.
సాయంత్రం 5 గంటలకు వరకు రాష్ట్రపతి దంపతులు అక్కడ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత చినజీయర్ ఆశ్రమం నుంచి హెలికాఫ్టర్‌లో రాష్ట్రపతి దంపతులు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రి బస చేసిన తర్వాత రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ముచ్చింతల్‌లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
