Potluri Vara Prasad (PVP): వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌, వ్యాపార వేత్త పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ మరో కేసు న‌మోదైంది. పీవీపీతో పాటు ఆయ‌న అనుచ‌రుల‌పైనా కేసు నమోదైంది.  మాజీ మంత్రి, భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నాయ‌కురాలు డీకే అరుణ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషను (Banjara Hills police) లో కేసు నమోదైంది. 

 Potluri Vara Prasad (PVP): వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌, ప్ర‌ముఖ వ్యాపార వేత్త పొట్లూరి వరప్రసాద్ (Potluri Varaprasad) అలియాస్ పీవీపీ మరో కేసు న‌మోదైంది. పీవీపీతో పాటు ఆయ‌న అనుచ‌రుల‌పైనా కేసు న‌మోదైంది. మాజీ మంత్రి, భార‌తీయ జ‌న‌తా పార్టీ Bharatiya Janata Party (బీజేపీ) నాయ‌కురాలు డీకే అరుణ (DK Aruna) కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషనులో కేసు నమోదైంది. తాను చెప్పిన‌ట్టుగానే న‌డుచుకోవాల‌నీ తాము నివాసం ఉంటున్న ప్రాంతాల్లో బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌నీ, తన ఇంటిలోకి అక్రమగా ప్రవేశించి..తన ఇంటి ప్రహరిగోడను కూల్చివేశారని డీకే ఆరుణ కుమార్తే ధర్మవరం కొట్టం శ్రుతిరెడ్డి త‌న ఫిర్యాదులు పేర్కొన్నారు. 

పొట్లూరి వరప్రసాద్ (Potluri Varaprasad) అలియాస్ పీవీపీ (PVP) పై న‌మోదైన కేసుకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. బంజారాహిల్స్‌ రోడ్ నంబ‌ర్ ఏడులోని ప్రేమ్‌ పర్వత్‌ విల్లాస్‌లో మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె ధర్మవరం కొట్టం శ్రుతిరెడ్డి నివాసం ఉంటున్నారు. అయితే, ఆదివారం పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) అనుచరులు బాలాజీ స‌హా మరికొందరు ధర్మవరం కొట్టం శ్రుతిరెడ్డి ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు. ఆమె ఇంటి ప్రహరిగోడను యంత్రాల‌తో కూల్చివేశారు. అక్క‌డ ఉన్న‌టువంటి రేకులను తొలగించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌హ‌రిగోడ‌ను కూల్చివేత అంశాన్ని ప్రశ్నించిన శ్రుతిరెడ్డిని దుర్భాషలాడారు పీవీపీ అనుచ‌రులు. అలాగే, ఆమెను భయపెట్టారు. ఈ క్ర‌మంలోనే డీకే అరుణ (DK Aruna) కుమార్తే ధర్మవరం కొట్టం శ్రుతిరెడ్డి బంజారాహిల్స్ పోలీసుల (Banjara Hills police) కు ఫిర్యాదు చేశారు. పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ తో పాటు ఆయ‌న అనుచ‌రులు బాలాజీ స‌హా మ‌రికొంద‌రిపై కేసులు నమోదయ్యాయి. దీనిపై ప్ర‌స్తుతం దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్ల‌డించారు. 

కాగా, త‌గంలోనూ పొట్లూరి వ‌ర ప్ర‌సాద్ (Potluri Varaprasad) (పీవీపీ) (PVP) పై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. చాలానే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బంజారాహిల్స్‌లో పీవీపీ ప్రేమ్ పర్వత్ విల్లాస్ (Prem Parvat Villas) అనే రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి అమ్మేసుకున్నారు. అక్క‌డి ఓ విల్లాలో పీవీపీ కూడా ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే అక్కడ విల్లాలు కొనుక్కున్న వారంతా తాను చెప్పినట్లుగా ఉండాలంటూ ప‌దే ప‌దే దిశానిర్దేశం చేస్తున్నార‌నీ, విన‌క‌పోతే భ‌య‌పెడుతున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అక్క‌డి ఎవరి ఇండ్ల‌ల్లోనూ ఎవరూ మార్పులు చేసుకోకూడ‌ద‌ని భ‌య‌పెడుతున్నార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఇదే త‌ర‌హాలో 2020 జూన్‌లో ఇలా ఓ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి నిర్మాణాలు కూలగొట్టాలన్న కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను ప్రశ్నించడానికి వెళ్లిన పోలీసులపై కుక్కల్ని వదిలారు. అయితే, రాజ‌కీయంగా ఆయ‌న‌కు ఉన్న పలుకుబడితో అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగారు. ఆ కేసు ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. తాజాగా మ‌ళ్లీ (PVP) అదే విల్లాస్ లోని మాజీ మంత్రి, బీజేపీ (BJP) నేత డీకే అరుణ (DK Aruna)కుమార్తే.. ధర్మవరం కొట్టం శ్రుతిరెడ్డి ఇంటి అవ‌ర‌ణ‌లోని ప్ర‌హ‌రీ గోడ‌ను ఆయ‌న అనుచ‌రులు కూల్చివేయ‌డంతో పాటు భ‌య‌పెట్టార‌ని కేసు న‌మోదైంది.