కాంగ్రెస్ గెలిచిన వెంటనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని చర్లపల్లి జైలుకు పంపి తీరుతామని ఆయన హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ గెలిచిన వెంటనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని చర్లపల్లి జైలుకు పంపి తీరుతామని ఆయన హెచ్చరించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజల సమస్యలన్నింటినీ తీరుస్తామని హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వ హయాంలోనైనా ప్రభుత్వ అధికారుల పనితీరు పారదర్శకంగా ఉండాలని, అందుకు ప్రభుత్వం కూడా అలాగే ఉండాలని అన్నారు.

కానీ.. టీఆర్ఎస్ హయాంలో మాత్రం పారదర్శక పాలన జగరలేదని ఆరోపించారు. కేసీఆర్ అరచాలకు ఎదురులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రకాల ప్రాజెక్టుల పేరు చెప్పి.. తన కుటుంబానికి ప్రజా ధనాన్ని దోచిపెట్టాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. ప్రజలు బాగుపడతారని అనుకుంటే.. కేసీఆర్ అధికారంలోకి వచ్చి దోపిడీ చేశారని విమర్శించారు.