Asianet News TeluguAsianet News Telugu

హత్య కేసులో ఇరికిస్తా.. ఇన్ స్పెక్టర్ బెదిరింపులు..!

షేకాపూర్ ప్రాంతానికి చెందిన లాయిక్ అలీ అలియాస్ లైక్ ప్రధాన నిందితుడిని తేలింది. ఇదే కేసులో మరో 8మందిని అరెస్టు చేయగా.. లైక్ పరారీలో ఉన్నాడు. 

police threaten Rowdy sheeter for money  in Telangana
Author
Hyderabad, First Published Aug 5, 2021, 7:58 AM IST

హైదరాబాద్ లో జరిగిన ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడి కోసం పోలీసులు దాదాపు ఏడు నెలలుగా వెతుకుతుండగా.. అతను ఉత్తరప్రదేశ్ లో హత్యకు గురైనట్లు తెలిసింది. ఆ కేసును అడ్డుపెట్టుకొని.. మరో రౌడీ షీటర్ ని  ఓ ఇన్ స్పెక్టర్ లబ్ధికి వాడుకోవడం గమనార్హం. ఈ సంఘటన తెలంగాణలోనే చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి,

బోరబండ ప్రాంతంలో గత జనవరి 26న రాత్రి రౌడీ సీటర్ కాలా ఫిరోజ్(42) హత్య జరిగగింది. ఆ కేసులో జహీరాబాద్ మండలం షేకాపూర్ ప్రాంతానికి చెందిన లాయిక్ అలీ అలియాస్ లైక్ ప్రధాన నిందితుడిని తేలింది. ఇదే కేసులో మరో 8మందిని అరెస్టు చేయగా.. లైక్ పరారీలో ఉన్నాడు. అనేక కేసుల్లో లైక్ నిందితుడు. ఫిరోజ్ హత్య అనంతరం పరారైన లైక్ ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీలో తల దాచుకున్నాడు. స్నేహితుడైన అమలాపురానికి చెందిన తాళ్ల రవి యూపీలోనే ఉండటంతో.. లైక్ అతనిని ఆశ్రయించాడు.

సదాశివపేటకు చెందిన సమీర్ అనే నేరస్షుడు కూడా వారికి జత కలిశాడు. ఈ క్రమంలో కాలా ఫిరోజ్ కు సమీప బంధువైన మల్లేపల్లికి చెందిన మరో రౌడీ షీటర్ నూ చంపి శత్రు శేషం లేకుండా చేయాలని లైక్ అనుకున్నాడు. అప్పటికే లైక్ కోసం వెతుకుతున్న ఓ కమిషనరేట్ లోని కీలక విభాగానికి చెందిన బృందం అతని స్థావరాన్ని గుర్తించి యూపీకి వెళ్లింది. లైక్ గత మార్చిలోనే అక్కడ హత్యకు గురయ్యాడనే విషయం వారికి తెలిసింది. కేసు మరుగున పడిందని అనుకున్నారు. తాళ్ల రవి, సమీర్ లే.. లైక్ ని హత్య చేసినట్లు విచారణలో తేలడం గమనార్హం. వారిని మాత్రం పోలీసులు తెలంగాణకు తీసుకువచ్చారు.

ఈ సంగతి మొత్తం పక్కన పెడితే.. మల్లేపల్లికి చెందిన రౌడీ షీటర్ ను బెదిరించి సొమ్ము చేసుకోవాలిని ో ఇన్ స్పెక్టర్ ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశమైంది. రవి, సమీర్ లను తెలంగాణకు తీసుకొస్తున్న క్రమంలోనే సదరు ఇన్ స్పెక్టర్ రౌడీ షీటర్ ను బెదిరించినట్లు వ తెలుస్తోంది. ముంబయి మీరుదగా ఆర్మూర్ వరకు వచ్చాక రౌడీ షీటర్ ను అక్కడకు పిలిపించుకున్నట్లు తెలిసింది. తనకు డబ్బు ఇవ్వకుంటే లైక్ హత్యలో ఇరికిస్తానని బెదిరించడం గమానర్హం. డబ్బు కాకుంటే.. రూ.50లక్షల విలువైన రెండు ఫ్లాట్లను ఇచ్చేలా మాట్లాడుకున్నట్లు తెలిసింది. దీంతో.. ఉన్నతాధికారికి ఉప్పందడంతో రవి, సమీర్ తో పాటు మల్లేపల్లి రౌడీ షీటర్ ను విచారించే బాధ్యతను మరో బంధానికి అప్పగించారు. రాయ్ బరేలీకి వెళ్లిన బృందంలోని ఇన్ స్పెక్టర్ సహా ఐదుగురిని విధుల నుంచి తప్పించడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios