Asianet News TeluguAsianet News Telugu

యాదాద్రి జిల్లాలో వాగులో ఇద్దరు యువతుల గల్లంతు: ఒకరిని కాపాడిన పోలీసులు, మరొకరి కోసం గాలింపు

యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు యువతుల్లో సింధూజను కాపాడారు స్థానికులు హిమబింధు కోసం  గాలింపు చర్యలు చేపట్టారు. ఇటుకలపల్లి నుండి కుర్రారం వైపు స్కూటీపై ఇద్దరు యువతులు సహా ఓ యువకుడు వెళ్లున్న సమయంలో  రాజపేట మండలం దోసలవాగు వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది.

police rescues teen girl from flood water in Yadadri Bhuvanagiri district
Author
Bhuvanagiri, First Published Aug 30, 2021, 5:19 PM IST

భువనగిరి: యాదాద్రి భువనగరి జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన  ఇద్దరు యువతుల్లో ఒకరిని స్థానికులు కాపాడారు. మరో యువతి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నాడు రాజాపేట మండలం కుర్రారం గ్రామ సమీపంలో దోసల వాగులో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు.

also read:యాదాద్రి జిల్లాలో వాగులో స్కూటీ సహా ఇద్దరు యువతుల గల్లంతు: గాలింపు చేపట్టిన పోలీసులు

ఇటుకలపల్లి నుండి కుర్రారం వైపు స్కూటీపై ఇద్దరు యువతులు సహా ఓ యువకుడు వెళ్లున్న సమయంలో  రాజపేట మండలం దోసలవాగు వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ వాగులో వరద ఉధృతిని తక్కువగా అంచనా వేసి స్కూటీని ముందుకు పోనిచ్చారు. 

వాగులో వరద ఉధృతికి స్కూటీ నీటిలో చిక్కుకుపోయింది. స్కూటీ పై నుండి హిమబింధు, సింధూజలు స్కూటీ  నుండి దిగారు. వాగులో వరద ఉధృతి కారణంగా హిమబింధు, సింధూజలు కొట్టుకుపోయారు.ఈ సమాచారం అందుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొన్నారు.

స్థానికుల సహాయంతో సింధూజను వరద నుండి బయటకు తీశారు. హిమబింధు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వరద నీటి నుండి బయట పడిన సింధూజను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సుమారు వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు వరదతో పోటెత్తాయి.  ఆదివారం నాడు కూడ రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసింది. దీంతో  వాగుల్లో వరద  ప్రవాహం ఎక్కువైంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios