పెద్దపల్లి: అడ్వకేట్ వామన్ రావు దంపతుల కేసులో కీలకంగా మారిన రెండు కత్తులను సోమవారం నాడు సాయంత్రం పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.గత నెల 17వ తేదీన వామన్ రావు దంపతులను రామగిరి మండలం కల్వచర్ల వద్ద రోడ్డుపై దారుణంగా హత్య చేశారు.

హత్య చేసిన తర్వాతర రెండు కత్తులను సుందిళ్ల బ్యారేజీ( పార్వతి బ్యారేజీ) లో వేశారు.  ఈ కత్తుల కోసం రెండు రోజులుగా పోలీసులు గాలింపులు చేపట్టారు.ఈ కత్తులను వెలికితీసేందుకు విశాఖపట్టణం నుండి ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను రప్పించారు. భారీ అయస్కాంతాలను కూడ ఉపయోగించి కత్తులను వెలికితీసే ప్రయత్నాలు చేశారు.

అయితే అయస్కాంతం వల్ల ప్రయోజనం దక్కలేదు.  గజ ఈతగాళ్లే సుందిళ్ల బ్యారేజీ నుండి ఈ కత్తులను వెలికితీశారు.బ్యారేజీలోని 59 పిల్లర్ వద్ద వేశామని కుంట శ్రీను, చిరంజీవి చూపారు. కుంట శ్రీనివాస్ చిరంజీవి చూపించిన ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.గజ ఈతగాళ్ల శ్రమ ఫలించింది. గజ ఈత గాళ్లకు రెండు కత్తులు లభించాయి.