Asianet News TeluguAsianet News Telugu

యధావిధిగా జేపీ నడ్డా ర్యాలీ అంటున్న బీజేపీ: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే నోటీసులిచ్చే చాన్స్


 సికింద్రాబాద్  నుండి ప్యారడైజ్ వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పారు.

Police Ready to give notice to Bjp national president JP Nadda
Author
Hyderabad, First Published Jan 4, 2022, 4:18 PM IST

హైదరాబాద్: కరోనా ఆంక్షల నేపథ్యంలో రాస్ట్రంలో ర్యాలీలు, సభల నిర్వహణకు ఎలాంటి అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ తరుణంలో ఇవాళ హద్రాబాద్ లో JP Nadda నిర్వహించే ర్యాలీకి కూడా అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే Secundrabad గాంధీ విగ్రహం నుండి ప్యారడైజ్ వరకు జేపీ నడ్డా ర్యాలీ నిర్వహిస్తారని Bjp ప్రకటించింది. అయితే కరోనా ఆంక్షల నేపథ్యంలో ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay అరెస్ట్ ను నిరసిస్తూ  క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని బీజేపీ భావించింది. అయితే  ఈ ర్యాలీకి అనుమతి లేదని డీసీపీ చందన దీప్తి తేల్చి చెప్పారు.

New delhi నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు జేపీ నడ్డా ఇవాళ సాయంత్రం చేరుకొంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుండి ప్యారడైజ్ కు ర్యాలీ నిర్వహించనున్నారు.  అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా కూడా ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు.

అయితే జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్టులో చేరుకొనే సమయంలో ఈ ర్యాలీకి అనుమతి లేదని తెలంగాణ పోలీసులు నోటీసులు అందించే అవకాశం ఉంది. అయితే ఈ నోటీసులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.

also read:హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్: రిమాండ్ రిపోర్టు క్వాష్ కోరుతూ పిటిషన్

317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న బండి సంజయ్ ను ఆదివారం నాడు రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసి Courtలో హాజరుపర్చారు. అయితే కోర్టు బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. అయితే  కరీంనగర్ పోలీసులు తన రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలని కోరుతూ Telangana High courtలో పిటిషన్ దాఖలు చేశారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. ఈ నెల 10వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో సభలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా బండి సంజయ్ ను అరెస్ట్ చేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ విషయమై క్యాండిల్ ర్యాలీకి బీజేపీ పిలుపునిచ్చింది. 

మరో వైపు 317 జీవో అంశం ప్రస్తుతం ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను కలవరపరుస్తుంది. 317 జీవోను రద్దు చేయాలని  ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ జీవోతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ విషయమై  సీఎం జోక్యం చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 317 జీవోపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతున్నాయి.  ఈ జీవో ప్రకారంగానే బదిలీలు కొనసాగిస్తే ఆంధోళనను మరింత ఉధృతం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios