హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డికి కేటాయించిన గన్‌మెన్లను తెలంగాణ పోలీసు శాఖ ఉపసంహరించుకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డికి తెలంగాణ పోలీసు శాఖ భద్రతను వెనక్కి తీసుకొంది.

ఎన్నికల సందర్భంగా తన ప్రాణాలకు ముప్పుందని భద్రతను పెంచాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.హైకోర్టు ఆదేశాల మేరకు 4+4 గన్‌మెన్లను  తెలంగాణ పోలీసు  శాఖ కేటాయించింది.

కౌంటింగ్ వరకు భద్రతను రేవంత్ రెడ్డికి కొనసాగించాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ పూర్తైనందున  రేవంత్ రెడ్డి నుండి 4+4 గన్‌మెన్లను తెలంగాణ పోలీసు శాఖ వెనక్కు తీసుకొంది.