నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నేడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.  గతేడాది సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ అనే యువకుడిని అతి దారుణంగా నడి రోడ్డుపై హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. హత్య జరిగిన దాదాపు 9 నెలల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 1600 పేజీల ఛార్జ్ షీట్ ని పోలీసులు సిద్ధం చేశారు. 

తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో... అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్ ని అతి దారుణంగా హత్య చేయించాడు.  ప్రణయ్ హత్యకు గురైన సమయంలో అమృత గర్భిణి. ఇటీవలే ఆమెకు మగ బిడ్డక కూడా జన్మించాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన మారుతీరావు ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చాడు.