Asianet News TeluguAsianet News Telugu

గూగుల్ పే చేశామని చెప్పి... ఉంగరం కాజేసి..

గుల్జార్‌హౌస్‌ సమీపంలో ట్వింకిల్‌ సోని దుర్గా జువెల్లరీ పేరుతో బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు వచ్చి మహిళలు ధరించే రింగ్‌ను చూపమని కోరారు. 

Police case against two people who theft the Gold Ring In Hyderabad
Author
Hyderabad, First Published Jan 22, 2021, 10:43 AM IST

ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించామని చెప్పి ఇద్దరు వ్యక్తులు బంగారం ఉంగరం కాజేశారు. ఈ సంఘటన మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుల్జార్‌హౌస్‌ సమీపంలో ట్వింకిల్‌ సోని దుర్గా జువెల్లరీ పేరుతో బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు వచ్చి మహిళలు ధరించే రింగ్‌ను చూపమని కోరారు. ట్వింకిల్‌ సోని చూపిన ఉంగరాల్లో 4.66 గ్రాముల ఉంగరాన్ని ఎంపిక చేసుకున్నారు. అనంతరం ఉంగరం ఖరీదు రూ. 23,800లను గూగుల్‌ పే ద్వారా డబ్బులు చెల్లించామని వారు తెలపడంతో ట్వింకిల్‌ తన ఫోన్‌లో చెల్లింపుల వివరాలను చూసుకోవడం ప్రారంభించాడు. 

ఈ సమయంలో వారిద్దరు ఉంగరం తీసుకొని ఉడాయించారు. గూగుల్‌పేలో డబ్బులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు షాపులోని కెమెరాలు, సమీపంలో ఉన్న కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మీర్‌చౌక్‌ క్రైం ఎస్‌ఐ జబ్బార్‌ తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios