తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అరెస్ట్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి కిషన్ రెడ్డి 24 గంటల ఉపవాస దీక్షకు కూర్చొన్న సంగతి తెలిసిందే.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి కిషన్ రెడ్డి 24 గంటల ఉపవాస దీక్షకు కూర్చొన్న సంగతి తెలిసిందే. రేపటి వరకు దీక్ష చేస్తానని కిషన్ రెడ్డి పట్టుబట్టారు.. అయితే సాయంత్రం 6 గంటల వరకే అనుమతి వుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో దీక్షా వేదిక చుట్టూ మోహరించిన పోలీసులు .. కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
అయితే దీక్షను భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఇబ్బంది ఏంటని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన దీక్షను కొనసాగిస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. ఈ పరిణామాలతో ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.