హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో సీరియల్ కిల్లర్ కిష్టప్పను బుధవారంనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పలు కేసులున్నాయి.

గత నెల 26వ తేదీన అమృతమ్మ అనే మహిళను కిష్టప్ప హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కిష్టప్ప గతంలో కూడ పలు నేరాలకు పాల్పడినట్టుగా తేలింది.ఇప్పటివరకు కిష్టప్ప ఆరుగురిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పలు హత్య కేసుల్లో పాల్గొన్న నిందితుడి కిష్టప్పపై  1985లోనే పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు.

రౌడీ షీట్ ఓపెన్ చేసినా కూడ నిందితుడి వైఖరిలో మార్పు రాలేదు. కిష్టప్ప గత నెలలో అమృతమ్మను హత్య చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు.

అమృతమ్మ హత్య కేసును విచారిస్తున్న సమయంలో కిష్టప్ప కదలికలపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో కిష్టప్పను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయాలు వెలుగు చూశాయి.నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ఇవాళ కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది.