వివాహేతర సంబంధం కోసం ఓ మహిళ కట్టుకున్న భర్త ను అతి కిరాతకంగా ప్రియుడి సహాయంతో చంపేసింది. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించింది. కానీ... చివరకు పోలీసులకు చిక్కింది. ఈ సంఘటన నిజామాబాద్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ కు చెందిన అబ్దుల్ సమద్ ఫైసల్(44) పెయింటర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య యాస్మిన్ బేగంకు అదే గ్రామానికి చెందిన మహ్మద్ అథఉల్లాతో సాన్నిహిత్యం ఏర్పడింది. విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు ఇద్దరినీ మందలించారు. మత పెద్దలకు ఫిర్యాదు చేశారు. అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా వదలించుకోవాలనుకున్న యాస్మిన్ బేగం ప్రియుడితో కలిసి ప్రణాళిక రూపొందించింది.

గత నెల డిసెంబర్ 16న రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన మహ్మద్, అదును చూసి కర్రతో ఫైసల్ తలపై కొట్టాడు. అపస్మారక స్థితిలో చేరుకున్న అతడి మెడకు తాడు బిగించి ఇద్దరూ కలిసి హత్య చేశారు. రోజంతా శవాన్ని గదిలో ఉంచారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి పారేస్తే ఎవరూ గుర్తుపట్టకుండా ఉంటారని భావించి మొదట కుడికాలు కోశారు. అయితే.. అది చాలా కష్టంగా ఉండటంతో.. ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు.

అనంతరం ముఖంపై కిరోసిన్ లో ముంచిన గుడ్డను ఉంచి కాల్చేశారు. మృతదేహంపై ఉన్న దుస్తులపై ఎలాంటి వివరాల్లేకుండా జాగ్రత్తపడ్డారు. శవాన్ని గోనెసంచిలో ఉంచి ఆటోలో నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో పడేశారు.. కాగా.. తర్వాత యాస్మిన్ బేగం ఏమీ తెలియద్దనట్లుగా నటించి.. భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల దర్యాప్తులో శవం దొరకడంతోపాటు.. భార్యే హత్య చేసినట్లు తేలింది. దీంతో.. పోలీసులు నిందులను అదుపులోకి తీసుకున్నారు.