Asianet News TeluguAsianet News Telugu

మాయలేడీ... గొంతు మార్చి బురిడీ.. ఎన్ఆర్ఐ పెళ్లికొడుకులే టార్గెట్

విలాసవంతమైన జీవితానికి అలవాటై మోసాలు  చేయడం మొదలుపెట్టింది. పెళ్లి పేరిట చాలా మందిని మోసం చేసింది. గతంలో ఆమెను పోలీసులు అరెస్టు చేయగా.. బెయిల్ పై బయటకు వచ్చింది. అయినా తన తీరును మార్చుకోకుండా మోసాలు చేస్తూనే ఉంది.

Police Arrest the woman who cheated NRI with the name of Marriage
Author
Hyderabad, First Published Feb 27, 2021, 7:38 AM IST

ఆమె మామూలు కిలాడీ కాదు.. డబ్బు కోసం ఇప్పటి వరకు చాలా మంది అబ్బాయిలకు కుచ్చుటోపీ పెట్టేసింది. మరీ ముఖ్యంగా ఎన్ఆర్ఐ పెళ్లికొడుకులను టార్గెట్ చేసుకొని డబ్బు గుంజుతోంది. వారిని నమ్మించేందుకు తన గొంతును ఎలా కావాలంటే అలా సులభంగా మార్చేస్తూ.. అందరినీ సులభంగా మోసం చేసేస్తోంది.

స్వాతి.. అర్చన, జూటూరి వరప్రసాద్, జూటూరి ఇందిరా ప్రియదర్శిని.. పుష్యతి ఇలా రకరకాల పేర్లతో ఎంతో మంది ఎన్ఆర్ఐలను ఆమె మోసం చేయగా.. తాజాగా ఆ కిలాడీని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కోవూరు మండలం రంగనాయకుల పేటకు చెందిన స్వాతి(30) ఎస్వీ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. అధ్యాపకుడిగా పనిచేసే కోరం దుర్గా ప్రవీణ్ తో ఆమెకు వివాహం అయ్యింది. ప్రస్తుతం ఘట్ కేసర్ పోచారంలో నివాసముంటోంది. విలాసవంతమైన జీవితానికి అలవాటై మోసాలు  చేయడం మొదలుపెట్టింది. పెళ్లి పేరిట చాలా మందిని మోసం చేసింది. గతంలో ఆమెను పోలీసులు అరెస్టు చేయగా.. బెయిల్ పై బయటకు వచ్చింది. అయినా తన తీరును మార్చుకోకుండా మోసాలు చేస్తూనే ఉంది.

గుర్తుతెలియని మహిళల ఫోటోలను గూగుల్ నుంచి డౌన్ లోడ్ చేసి నకిలీ ప్రొఫైల్స్ ను మ్యాట్రీమోనీ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేసింది. విదేశాల్లో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని.. పెళ్లి తర్వాత అక్కడే ఉంటానని.. కేవలం ఎన్ఆర్ఐలను మాత్రమే పెళ్లి చేసుకుంటానని ఆమె నమ్మించడం గమనార్హం.

ఓ యాప్ ద్వారా తన ఫోన్ నెంబర్ విదేశాల్లో ఉన్నట్లు రూపొందించింది. ఆ ఫోన్ నెంబర్ ను అన్ని మ్యాట్రీమోనీ వెబ్ సైట్లలో పోస్టు చేసింది. ఆ నెంబర్ నుంచే అందరూ మాట్లాడేవారు. నేరుగా ఆమె పెళ్లికొడుకులతో మాట్లాడేదికాదు. తల్లిదండ్రులతోనే మాట్లాడితనే పెళ్లి జరుగుతుందంటూ షరతు పెట్టేంది.

వాయిస్ మాడ్యూలేషన్ ద్వారా గొంతు మార్చి తన కుటుంబసభ్యులు మాట్లాడుతున్నట్లు నమ్మించేది. పెళ్లి వ్యవహారాలు మొత్తం పెళ్లి పెద్ద పేరుతో తానే మాట్లాడేది. అంతా ఒకే అనుకున్న తర్వాత తాను ఇండియా వచ్చానని.. కావాలంటే మాట్లాడొచ్చంటూ ఇక్కడి నెంబర్ ఇచ్చేది. వారితో మాట్లాడి.. తనకు పెళ్లి ఇష్టమేనని చెప్పేది. తర్వాత తాను కాబోయే కోడలినే కదా అంటూ వారి దగ్గర డబ్బులు గుంజడం మొదలుపెట్టేది. చాలా మంది అలా ఆమెను నమ్మి డబ్బులు ఇచ్చారు. కాగా.. తర్వాత పెళ్లికి ఒత్తిడి తేవడంతో ఫోన్ నెంబర్లు మార్చేది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.


 


 

Follow Us:
Download App:
  • android
  • ios