అక్కడి నుంచీ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో గతేడాది ఓల్డ్ బోయిన్ పల్లిలోని పెద్దమ్మ ఇంట్లో వదిలేశారు.

ప్రేమ పేరుతో బాలికకు దగ్గరై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బాలిక(16) ను ఆమె తల్లిదండ్రులు నగరంలోని ఓ హాస్టల్ ఓ ఉంచారు. అక్కడి నుంచి పారిపోవడంతో నల్గొండలోని ఛైల్డ్ వెల్ఫేర్ హోంలో చేర్పించారు. అక్కడి నుంచీ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో గతేడాది ఓల్డ్ బోయిన్ పల్లిలోని పెద్దమ్మ ఇంట్లో వదిలేశారు.

సంగారెడ్డి జిల్లా, కోహిర్ కు చెందిన ఇర్ఫాన్(25) ఓల్డ్ బోయిన్ పల్లికి వచ్చి అద్దెకు ఉంటూ ఓ మత పెద్ద వద్ద పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం బాలికతో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. అనంతరం ఆమె పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత బాలిక గుంటూరు పారిపోయింది. ఇర్ఫాన్ కూడా వెళదామని అనుకున్నాడు. అయితే.. అప్పటికే బాలిక కనిపించడం లేదంటూ వాళ్ల పెద్దమ్మ ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయగా నిందితుడుని, బాలికను కనుగొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.