హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. ఓ వ్యక్తి అధికారులకు పట్టుపడ్డాడు. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన‌‌ ఓ ప్రయాణీకుడి వద్ద కేజిన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

మహమ్మద్ అనే వ్యక్తి కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టు‌గా మార్చి నడుము భాగంగా దాచాడు. అక్రమ బంగారం తరలించే ప్రయత్నం చేసిన మహమ్మద్‌ను అధికారులు అరెస్ట్ చేశారు.  కేసు నమోదు చేసిన అధికారుల‌ బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.