Asianet News TeluguAsianet News Telugu

ఉద్రిక్తత... గన్ పార్క్ వద్ద ఆర్టీసీ కార్మికుల అరెస్ట్

తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం ఉదయం ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన నిరహారదీక్షకు తలపెట్టిన సంగతి తెలిసిందే. కాగా... ఈ దీక్ష అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇందిరాపార్క్ వద్దకు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తామని ముందే ప్రకటించారు. ప్రకటించినట్లుగానే కొందరిని ఇప్పటికే అరెస్టు చేశారు.

police arrest RTC workers at gun park
Author
Hyderabad, First Published Oct 7, 2019, 10:28 AM IST

గన్ పార్క్ వద్ద ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం అమరవీరులకు నివాళులు అర్పించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు గన్ పార్క్ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా... ఇందిరాపార్క్ వద్ద తమ దీక్ష మాత్రం కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నారు. ఈ రోజు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలా ఉండగా జేఏసీ సభ్యుల దీక్షకు ట్రేడ్ యూనియన్లు, ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. అయితే.. దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ఆంక్షలు అమల్లో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం ఉదయం ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన నిరహారదీక్షకు తలపెట్టిన సంగతి తెలిసిందే. కాగా... ఈ దీక్ష అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇందిరాపార్క్ వద్దకు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తామని ముందే ప్రకటించారు. ప్రకటించినట్లుగానే కొందరిని ఇప్పటికే అరెస్టు చేశారు.

అయితే...అరెస్టులు జరిగినా తమ దీక్ష మాత్రం కొనసాగుతుందని ఆర్టీసీ జేఎసీ ప్రకటించింది.ఇందిరాపార్క్ వద్ద తాము తలపెట్టిన నిరహారదీక్షకు మద్దతివ్వాలని పలు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలను ఆర్టీసీ జేఎసీ కోరింది. ఈ మేరకు ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు ఆర్టీసీ జేఎసీకి మద్దతుగా నిలిచాయి.

సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ఆదివారం నాడు రాత్రి ప్రకటించారు. దీంతో సోమవారం నాడు ఇందిరాపార్క్ వద్ద ఆర్టీసీ జేఎసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరహారదీక్షకు దిగనున్నారు.ఇందిరా పార్క్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతిని నిరాకరించారు.ఈ పరిస్థితుల్లో దీక్ష కొనసాగిస్తామని జేఎసీ ప్రకటించడంతో పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించడాన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావాన్ని తెలిపాయి. దీంతో ఇందిరాపార్క్ వద్ద దీక్ష ఎలా సాగుతోందనే ఉత్కంఠ నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios