పరీక్ష తర్వాత ఆన్సర్ షీట్ ని వెంట తీసుకెళ్లిన విద్యార్థి... అరెస్ట్
ఇంటర్ పరీక్షలు రాసి... ఆన్సర్ షీట్ ని ఇన్విజిలేటర్ కి ఇవ్వకుండా.... వెంట తీసుకువెళ్లిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఆన్సర్ షీట్ తీసుకొని అతను ఇంటికి కూడా వెళ్లకపోవడం గమనార్హం.
ఇంటర్ పరీక్షలు రాసి... ఆన్సర్ షీట్ ని ఇన్విజిలేటర్ కి ఇవ్వకుండా.... వెంట తీసుకువెళ్లిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఆన్సర్ షీట్ తీసుకొని అతను ఇంటికి కూడా వెళ్లకపోవడం గమనార్హం. ఇంట్లో వాళ్లకి కూడా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాగా.. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే...ఈనెల 9న ఇస్లామియా కాలేజీలో ఇంటర్ మ్యాథ్స్ పరీక్ష జరుగుతుండగా ఆ పరీక్షకు హాజరైన మహ్మద్ హుజేఫ్ అహ్మద్(19) తన ఆన్సర్ షీట్ ఇన్విజిలేటర్‌కు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. గుర్తించిన ఇన్విజిలేటర్ అదేరోజు రైన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం ఆ యువకుడు ఇస్లామియా కాలేజీ వద్ద తచ్చాడుతుండగా అరెస్ట్ చేశారు. అతని నుంచి ఆన్సర్ షీట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అహ్మద్ ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.