తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ నిజామాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రధానికి తెలంగాణ బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు.