తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్పీడు పెంచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు, కార్యకర్తల్లో జోష్ నింపడానికి ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు. ఇవాళ నిజామాబాద్, మహబూబ్‌‌‌నగర్‌లలో జరిగే భారీ బహిరంగసభల్లో ప్రధాని పాల్గొంటారు.

ఈ నేపథ్యంలో తెలంగాణకు వస్తూ మోడీ తెలుగులో ట్వీట్ చేశారు.  నా ప్రియాతి ప్రియమైన తెలంగాణా సోదర సోదరీమణులారా!! ఇవాళ మన తెలంగాణా గడ్డ మీద అడుగుపెట్టడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను... మొదట నేను నిజామాబాద్ ర్యాలీలో మాట్లాడిన తరువాత మహబూబ్‌నగర్‌లో మీతో నా భావాలు పంచుకొంటాను..

రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడానికి మీ ఆదరాభిమానాలు, ఆశీస్సులను కోరుకుంటున్నాను. NM Mobile app ద్వారా ఈ ర్యాలీ విశేషాలను నిరంతరం చూడండి’ అని మోదీ ట్వీట్‌ చేశారు.