Asianet News TeluguAsianet News Telugu

నా భర్త బ్రతికున్నాడా చనిపోయాడా?: ఆవేదనతో కేటీఆర్ కి మహిళ ఫిర్యాదు

తను, తన భర్త, ఇద్దరు కూతుళ్లతో సహా అంతా కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందడానికి గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యామని, ఇప్పుడు కేవలం తాను, ఇద్దరు కూతుర్లు మాత్రమే తిరిగి వచ్చామని, తన భర్త ఎక్కడున్నాడనే విషయంపై ఆసుపత్రి వర్గాలు క్లారిటీ ఇవ్వడంలేదని ఆ సదరు మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. 

Please Help me With My Husband's Details, Woman Asks KTR
Author
Hyderabad, First Published May 21, 2020, 8:16 AM IST

కరోనా చికిత్స నిమిత్తం తీసుకెళ్లిన తన భర్త జాడ దొరకడంలేదంటూ, తనకు తన భర్త విషయంలో సహాయం చేయాలని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లింది ఆవేదన చెందిన ఒక మహిళ. 

తను, తన భర్త, ఇద్దరు కూతుళ్లతో సహా అంతా కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందడానికి గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యామని, ఇప్పుడు కేవలం తాను, ఇద్దరు కూతుర్లు మాత్రమే తిరిగి వచ్చామని, తన భర్త ఎక్కడున్నాడనే విషయంపై ఆసుపత్రి వర్గాలు క్లారిటీ ఇవ్వడంలేదని ఆ సదరు మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. 

ఒకసారి తన భర్త వెంటిలేటర్ పై ఉన్నాడని, మరోసారి మరణించాడని ఇలా అనేక రకాలుగా చెప్పారని ఆమె వాపోయారు. తన భర్త మే 1వ తేదీన మరణించాడని, 2వ తేదీన అంత్యక్రియలు పూర్తి చేశామని మరో సిబ్బంది చెప్పారని, తన భర్త శవాన్ని ఖననం చేయడానికి అనుమతి కూడా తీసుకోలేదని ఆమె అన్నారు. చివరి చూపునకు కూడా తాము నోచుకోలేదని తన ఆవేదనను వెళ్లగక్కారు. 

తన భర్త కేసు విషయంలో తనకు సహాయం చేయాలని ఆమె మంత్రి కేటీఆర్ ను వేడుకున్నారు. ఇకపోతే.... గత కొద్దిరోజులుగా ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైన తెలంగాణలో ఇవాళ ఉద్ధృతి కాస్త తగ్గింది. బుధవారం రాష్ట్రంలో 27 కొత్త కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,661కి చేరుకుంది. ఇందులో 1,013 మంది డిశ్చార్జ్ కాగా, ఇద్దరు చనిపోవడంతో మరణాల సంఖ్య 40కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 608 మంది చికిత్స పొందుతున్నారు. బుధవారం ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఇవాళ నమోదైన కేసుల్లో 15 జీహెచ్‌ఎంసీలో, 12 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు. వీరితో కలిపి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 89 మందికి వైరస్ సోకినట్లయ్యింది.

ఇప్పటి వరకు తెలంగాణలో వనపర్తి, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్క కోవిడ్ 19 కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే మరో 25 జిల్లాల్లో గత 14 రోజులుగా ఎలాంటి పాజిటివ్ కేసులూ నమోదు కాలేదు. 

ఇక కరోనా మరణాల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 4.2 శాతం మంది మరణించగా, భారత్‌లో 0.2 శాతం మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారని ఆయన ప్రకటించారు.

కరోనా సోకి కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని.. లాక్‌డౌన్ -1 ప్రారంభమైనప్పుడు రికవరీ రేటు 7.1 శాతం ఉండగా, లాక్‌డౌన్-2 సమయంలో 11.42 శాతం, తర్వాత అది 26.59 శాతానికి పెరిగి, ప్రస్తుతం 39.62 శాతానికి పెరిగిందని లవ్ అగర్వాల్ ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios