Asianet News TeluguAsianet News Telugu

వీఐపీ మూమెంట్ పై హైకోర్టులో పిల్: విచారించలేనన్న జడ్జి


విచారణను స్వీకరించిన హైకోర్టు పిటీషనర్ వాదనలను పరిశీలించింది. అనంతరం సీఎం, గవర్నర్ తోపాటు తనకు కూడా వీఐపీ మూమెంట్ ఉందని అందువల్ల తాను ఈ పిటీషన్ ను విచారణ చేయలేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటీషన్ ను మరో బెంచ్ కి బదిలీ చేయాలని రిజిస్ట్రార్ కు ఆదేశించింది. 

PIL in High Court on VIP Moment
Author
Hyderabad, First Published Jul 5, 2019, 9:03 PM IST

హైదరాబాద్: వీఐపీ మూమెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. వీఐపీ మూవ్ మెంట్ పై సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు వడ్డి సోమశేఖర్ అనే వ్యక్తి. ముఖ్యమంత్రి, గవర్నర్, ఇతర ప్రజాప్రతినిధులు రాకపోకల సమయంలో గంటల తరబడి  ట్రాఫిక్ నిలిపివేస్తున్నారంటూ పిల్ లో పేర్కొన్నారు. 

వీఐపీ మూమెంట్ సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడంతో ఎండాకాలం, వర్షాకాలంలో ప్రజలకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. ప్రజాప్రతినిధుల మూమెంట్ సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడంపై ఎక్కడైనా చట్టం ఉందా, లేదా ఏదైనా జీవో ఉందా ఉంటే చూపించాలని పిల్ లో కోరారు పిటిషనర్ సోమశేఖర్. 

విచారణను స్వీకరించిన హైకోర్టు పిటీషనర్ వాదనలను పరిశీలించింది. అనంతరం సీఎం, గవర్నర్ తోపాటు తనకు కూడా వీఐపీ మూమెంట్ ఉందని అందువల్ల తాను ఈ పిటీషన్ ను విచారణ చేయలేనని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ పిటీషన్ ను మరో బెంచ్ కి బదిలీ చేయాలని రిజిస్ట్రార్ ను ఆదేశించారు. 

ఇకపోతే రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం సుమారు 40 నిమిషాలపాటు ట్రాఫిక్ ను నిలిపివేశారు పోలీసులు. దాంతో వర్షంలోనే ప్రజలు నిలిచిపోవాల్సి వచ్చింది. దాంతో పోలీసులపై ప్రజలు తిరగడడిన పరిస్థితినెలకొంది.  ఈ నేపథ్యంలో సోమశేఖర్ పిల్ దాఖలు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios