Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఉద్యమం నాటి కేసు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు జైలు శిక్ష

తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకోలో పాల్గొన్న కేసుకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు ప్రజాప్రతినిధుల కోర్ట్ జైలు శిక్ష విధించింది. 
 

peoples representatives court sentences trs mla dasyam vinay bhaskar jail ksp
Author
Hyderabad, First Published Jul 28, 2021, 4:23 PM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు ప్రజాప్రతినిధుల కోర్ట్ షాకిచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకోలో పాల్గొన్నారు వినయ్ భాస్కర్. ఈ కేసులో విచారణ సందర్భంగా ఆయన జైలు శిక్ష విధించింది కోర్ట్. అనంతరం వినయ్ భాస్కర్‌కు బెయిల్ మంజూరు చేసింది. 

Also Read:ఎన్నికల్లో డబ్బు పంపిణీ.. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు జైలుశిక్ష

ఇక కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్ నేత, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు కోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. 2019 ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేశారన్న కేసులో భాగంగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది. మాలోత్ కవితపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు తీర్పు మేరకు రూ.10 వేల జరిమానాను చెల్లించారు ఎంపీ మాలోత్ కవిత. అదే సమయంలో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios