ఎంఐఎం అగ్రనేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి ప్రజాప్రతినిధుల కోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 3న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఎంఐఎం అగ్రనేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి ప్రజాప్రతినిధుల కోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 3న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. రెచ్చగొట్టే ప్రసంగం చేశారని గతంలో అక్బర్‌పై నిర్మల్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే నిర్మల్‌లో అక్బరుద్దీన్‌పై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేశారు. దీనిలో భాగంగానే కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది.