రెండు రోజుల క్రితం వరకు ఎండలు బాగా మండిపోయాయి. రెండు నిమిషాలపాటు బయటకు వెళ్లాలన్నా కూడా కష్టంగా ఉండేది. కానీ రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు వచ్చాయి.
రెండు రోజుల క్రితం వరకు ఎండలు బాగా మండిపోయాయి. రెండు నిమిషాలపాటు బయటకు వెళ్లాలన్నా కూడా కష్టంగా ఉండేది. కానీ రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు వచ్చాయి. క్రమంగా ఎండ తీవ్రత తగ్గింది. వర్ష సూచన కూడా కనపడుతోంది. మొన్నటి వరకు 41డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత.. ఇప్పుడు 37కి పడిపోయింది. ఎండలు తగ్గి వాతావరణం చల్లపడితే మంచిదే కానీ.. ఈ అకస్మాత్తు మార్పుకి ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు.
ఒక్కసారిగా వాతావరణం మారడంతో చాలా మంది ప్రజలు వైరల్ ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు వంటి రోగాల బారిన పడుతున్నారు. ఎలర్జీ, ఆస్తమా వంటి వాటిన బారిన కూడా పడుతున్నారు.దుమ్ము, దూళి తో కూడిన గాలులు అధికంగా వీయడం కూడా ఒక కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
