కమలం గూటికి మరో టీఆర్ఎస్ నేత.. బీజేపీలో చేరనున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు..?
మరో టీఆర్ఎస్ నేత బీజేపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు కమలం గూటికి చేరేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది.
టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంత కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో ఆయన క్రియాశీలకంగా ఉండటం లేదు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల ఆయన త్వరలోనే కమలం గూటికి చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: కేరళ నుండి హైద్రాబాద్ కు చేరుకున్న సిట్ బృందం
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో పాటు పుట్ట మధు ఇటీవల ఢిల్లీలో కనిపించారు. ఇది ఆయన బీజేపీలో చేరుతారనే వాదనలకు బలాన్ని చేకూరుస్తోంది. అయితే పుట్ట మధు బీజేపీలో చేరడాన్ని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కానీ ఆయన కలమదళంలోకి చేరేందుకు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
క్యాసినో కేసు: ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ .రమణ
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఇటీవల సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఇతర నాయకులతో సమావేశం నిర్వహించారు. అయితే దీనికి పుట్ట మధుకు ఆహ్వానం అందలేదు. అయితే దీని వల్ల ఆయన తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. టీఆర్ఎస్ నుంచి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే భయం ఆయనకు పట్టుకుంది.
ఆర్ అండ్ బీ శాఖపై కేసీఆర్ సమీక్ష... కొత్త సచివాలయంపై కీలక వ్యాఖ్యలు
ఈ పరిణామాల పుట్ట మధు ముందే తన దారి వెతుకుంటున్నట్టు తెలుస్తోంది. పైగా ఆయనపై గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎప్పుడైనా ఈడీ, రైడ్స్ జరగవచ్చనే ఆలోచనలో ఉన్నారు. అందుకే బీజేపీలో చేరితే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు.