Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో కొడుకు పెళ్లి.. ఆన్ లైన్లో ఆశీర్వాదం

ఈ క్రమంలో ఓ తల్లిదండ్రులకు కనీసం కన్న కొడుకు పెళ్లిని కళ్లారా వీక్షించే భాగ్యం కూడా దక్కలేదు. ఆన్ లైన్ లో చూసి.. అందులోనే ఆశీర్వాదం పంపారు.

Parents blessed their son in online over his marriage
Author
Hyderabad, First Published Apr 21, 2020, 7:26 AM IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో పలు దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ కారణంగా ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉండిపోయారు. కొందరు మాత్రం పరాయి దేశాల్లో ఇరుక్కుపోయారు. కనీసం స్వదేశానికి చేరుకునే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. 

ఈ క్రమంలో ఓ తల్లిదండ్రులకు కనీసం కన్న కొడుకు పెళ్లిని కళ్లారా వీక్షించే భాగ్యం కూడా దక్కలేదు. ఆన్ లైన్ లో చూసి.. అందులోనే ఆశీర్వాదం పంపారు. ఈ సంఘటన ఖమ్మంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం నగరానికి చెందిన సీనియర్‌ అడ్వకేట్‌, జాతీయ బాడీబిల్డింగ్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ స్వామి రమేష్‌ రెండవ కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు.   అతనికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన అమెరికా సెటిలర్స్‌ కుటుంబంలోని అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. 

ఇంకేం అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దామనుకున్న ఆ కుటుంబాలకు అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభించడం మూలాన అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు అక్కడకు వెళ్లలేక పోగా, అక్కడ పెళ్లి తంతులో పది మందికంటే ఎక్కువగా  ఉండరాదనే నిబంధనతో తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆన్‌లైన్‌లో పెళ్లి చూస్తూ లక్షింతలు వేసి ఆశీర్వదించారు.

 కేవలం పది మంది బంధుమిత్రుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం పసుపుకొమ్ముతో తాళిని వధువు మెడలో కట్టడంతో పెళ్లితంతు పూర్తయింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios