హైదరాబాద్: తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మనమడిపై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ర్యాగింగ్ కేసు నమోదైంది.

మహమూద్ అలీ మనమడిపై రియాన్ అనే  విద్యార్ధి ఆదివారం నాడు పంజగుట్ట పోలీసులకు పిర్యాదు చేశాడు. హోం మంత్రి మనమడు పఠాన్ బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 3లోని ముఫకంజా ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు.

కొంతమంది విద్యార్థులతో గ్యాంగ్ గా ఏర్పడి ఇతర విద్యార్దులను పఠాన్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో విద్యార్ధి పేర్కొన్నారు. తమను ర్యాగింగ్ పేరుతో ఇబ్బందిపెడుతున్నాడని ఆయన ఆ ఫిర్యాదులో తెలిపారు. పఠాన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. 

పఠాన్ తమను ర్యాగింగ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని  అదే కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్ధి రియాన్ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.