Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలో ఈటల ఆశించింది జరగడం లేదు.. నేను కూడా భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళతాను: పాల్వాయి స్రవంతి

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి సీఎం కేసీఆర్‌ రూ.25 కోట్లు ఇచ్చారంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.తాజాగా ఈటల ఆరోపణలను కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఖండించారు. 

palvai sravanthi condemn etela rajender allegations ksm
Author
First Published Apr 22, 2023, 2:03 PM IST | Last Updated Apr 22, 2023, 2:03 PM IST

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి సీఎం కేసీఆర్‌ రూ.25 కోట్లు ఇచ్చారంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈటల రాజేందర్ ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి అన్నారు. ఈటల ఆరోపణలను ఖండిస్తున్నట్టుగా చెప్పారు. తమకు డబ్బులు వచ్చాయని ఈటల అంటున్నారని.. అయితే ఎవరికిచ్చారని ప్రశ్నించారు. తన ఎన్నిక ప్రచారానికి ఖర్చు తాను, పార్టీ, పార్టీ నేతలు, కార్యకర్తలు పెట్టుకున్నారని చెప్పారు. బీఆర్ఎస్‌లో ఈటల రాజేందర్ ఉన్నప్పుడు ఇలాంటి డీల్స్ ఫిక్స్ చేశారా? అని ప్రశ్నించారు. 

ఏదో ఆశించి ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్లాడని.. కానీ అక్కడ ఏం జరగుతుదలేదని విమర్శించారు. ఇది ఈటల రాజేందర్ వ్యక్తిగత అభిప్రాయమా? బీజేపీ అభిప్రాయమా? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు అయిపోయిన ఆరు నెలలకు ఇప్పుడేందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

Also Read: ఈటల వ్యాఖ్యల కలకలం.. వీహెచ్ కౌంటర్.. రేవంత్ సవాల్ మీద స్పందించని ఈటల..!

రేవంత్ రెడ్డి పార్టీ కోసం ఏం చేశారనేది తమకు తెలుసనని అన్నారు. తాను కూడ ఈరోజు సాయంత్రం భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్తానని చెప్పారు. ఈటల రాజేందర్‌కు దమ్ము ఉంటే సాయంత్రం భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios