హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా మాజీ మంత్రి పద్మారావు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయమై చర్చించారు.

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా  మాజీ మంత్రి పద్మారావు పేరును టీఆర్ఎస్ ప్రతిపాదించింది. ఈ విషయమై ఇవాళ కాంగ్రెస్ నేతలతో కేటీఆర్ చర్చించారు. డిప్యూటీ స్పీకర్‌గా పోటీ చేస్తున్న పద్మారావు కూడ కాంగ్రెస్ నేతలను కలిశారు.

డిప్యూటీ స్పీకర్‌ పదవికి పద్మారావు నామినేషన్ దాఖలు చేశారు. పద్మారావు అభ్యర్థిత్వానికి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కూడ సానుకూలంగా స్పందించింది.దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

పద్మారావు ఒక్కరే డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది.