తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ కి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్స్ కాంగ్రెస్ ని వీడుతున్నారు.  ఇప్పటికే చాలా మంది పార్టీని వీడగా తాజాగా మరికొందరు పార్టీని వీడారు. పార్టీలో ఇంచార్జ్ ల పేరిట కొందరు పెత్తనం చెలాయిస్తూ.. పార్టీకి నష్టం కలిగిస్తున్నారనే ఆవేదన జనగామలో పలువురు పార్టీని వీడారు.

రాజీనామా చేసిన వారిలో కాంగ్రెస్ జనగామ ప్రధాన కార్యదర్శి సిద్దిరాం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుర్రపు బాల్ రాజు, మండల ఉపాధ్యక్షుడు అమీజ్ లు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందినా.. తాము నిబద్ధతతో పనిచేశామన్నారు. పార్టీని వదిలి వెళ్లినప్పుడు.. ఇప్పుడు మళ్లీ తిరిగివచ్చి ఇంఛార్జిల పేరిట పెత్తనం చేస్తున్నారన్నారు.

అనవసరంగా కార్యకర్తలపై, నాయకులపై పెత్తనం చెలాయిస్తూ.. ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. దీంతో మనస్థాపం చెంది.. తాము పార్టీని వీడుతున్నట్లు వారు వివరించారు.