కలకలం: హరీష్ రావుపై మరోసారి కేసీఆర్ బ్యాన్

First Published 16, Feb 2019, 11:49 AM

తనయుడు కేటీ రామారావుకు అడ్డంకులు తొలగించే క్రమంలో సిద్ధిపేట శాసనసభ్యుడు, తన మేనల్లుడు తన్నీరు హరీష్ రావు పాత్రను తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కే. చంద్రశేర రావు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని గత కొంత కాలంగా ప్రచారంలో ఉంది.

ప్రచారానికి తగినట్లుగానే మరోసారి హరీష్ రావు వార్తలపై టీఆర్ఎస్ అధికారిక దినపత్రిక నమస్తే తెలంగాణ దినపత్రికలో నిషేధం పెట్టినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆయనకు సంబంధించిన వార్తలను ప్రచురించకూడదని ఎడిటోరియల్ టీంకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

గత మూడు రోజులుగా హరీష్ రావుకు సంబంధించిన వార్తలు నమస్తే తెలంగాణలో కనిపించడం లేదని అంటున్నారు. అయితే, సిద్ధిపేట స్థానిక ఎడిషన్ లో మాత్రం చిన్నపాటి వార్తలు ప్రచురితమయ్యాయి.

ఎన్నికలకు ముందు హరీష్ రావు వార్తలపై నమస్తే తెలంగాణ పత్రిక నిషేధం పెట్టిన విషయం తెలిసిందే. అయితే, అది తిరగబడే సూచనలు కనిపించడంతో ఆయన వార్తలపై నిషేధం విధించారు. గజ్వెల్ నియోజకవర్గంలో మామ కేసీఆర్ విజయానికి ఆయన అలుపు ఎరగకుండా ప్రచారం చేశారు.

ఎన్నికల తర్వాత పూర్తిగా సీన్ మారినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ ప్రత్యర్థి వంటేరు ప్రతాప రెడ్డి టీఆర్ఎస్ లో చేరిపోయారు. నిజానికి వంటేరు ప్రతాప రెడ్డి ఎన్నికలకు ముందు హరీష్ రావుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన ప్రత్యర్థి కేసీఆర్ కాదని, హరీష్ రావు అని అర్థం చేసుకోవచ్చు.

తాజాగా, సంగారెడ్డి కాంగ్రెసు శాసనసభ్యుడు జగ్గారెడ్డి విచిత్రమైన వ్యూహాన్ని ఎంచుకున్నారు. కేటీ రామారావును ప్రశంసిస్తూ హరీష్ రావును విమర్శిస్తూ వస్తున్నారు. కేసీఆర్ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలను చూస్తే ఆయన కాంగ్రెసులో కన్నా టీఆర్ఎస్ రాజకీయాలే నడుపుతున్నట్లు కనిపిస్తున్నారు. జగ్గారెడ్డి వ్యూహం వెనక హరీష్ రావు పాత్రను ఉమ్మడి మెదక్ జిల్లాలో తగ్గించే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు.

తాజా పరిణామాలను పరిశీలిస్తే, హరీష్ రావుకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పార్టీ పగ్గాలను చేతుల్లోకి తీసుకున్న కెటీఆర్ ను పక్కన పెడుతూ ఏ బాధ్యతలూ లేని హరీష్ రావును కూడా పక్కన పెట్టే ఎత్తుగడలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

మరో పరిణామాన్ని కూడా సిద్ధిపేట స్థానిక నాయకులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో దాదాపుగా హరీష్ రావుకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు వార్తలు వచ్చిన దాఖలాలు లేవు. కానీ, తాజాగా ఓ వార్త ప్రచురితమైంది. సిద్ధిపేట, మెదక్ రోడ్డు నిర్మాణం పరిస్థితి గత మూడేళ్లుగా మూలనపడిందనేది ఆ వార్తా సారాంశం

కేసీఆర్ ఎత్తుగడలో భాగంగానే హరీష్ రావుకు వ్యతిరేకంగా పరిస్థితులు మారుతున్నట్లు చెబుతున్నారు. హరీష్ రావు వద్ద ఓఎస్డీగా పనిచేసిన శ్రీధర్ రావు దేశ్ పాండేను కేసీఆర్ తన ఓస్డీడిగా నియమించుకోవడం కూడా అందులో భాగమేనని అంటున్నారు.