మల్లన్న సాగర్ ముంపు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ముంపులో తమ గ్రామం పూర్తిగా పోతుందన్న ఆవేదనతో ఓ వ్యక్తి తన ఇంట్లోనే చితి పేర్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. 

మల్లన్న సాగర్ ముంపు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ముంపులో తమ గ్రామం పూర్తిగా పోతుందన్న ఆవేదనతో ఓ వ్యక్తి తన ఇంట్లోనే చితి పేర్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సిద్ధిపేట జిల్లా మల్లన్నసాగర్ ముంపు గ్రామం వేములఘాట్ లో ఈ దారుణం జరిగింది. కూలగొట్టిన తన ఇంటి ఆవరణలోనే చితి పేర్చుకుని తుటుకూరి మల్లారెడ్డి (70) అనే వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చితిలో మిగిలిన శరీర భాగాలను పోస్టుమార్టానికి పంపించారు. వృద్ధుని ఆత్మహత్యకు గల కారణాల మీద దర్యాప్తు ప్రారంభించారు. 

కాగా, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాకపోవడంతోనే మనో వేదనతో మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం వినిపిస్తోంది. అయితే మల్లారెడ్డి ఇంట్లో అర్హులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఘటన మీద పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.