అక్కడ ఆయన గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. కాగా.. ఈ సహపంక్తి భోజనంలో ఆయనతోపాటు కలిసి పాల్గొన్న ఆకుల ఆగవ్వ అనే మహిళ అస్వస్థతకు గురైంది. 

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి లో ఈ నెల 22న సీఎం కేసీఆర్ పర్యటించిన సంగతి తెలసిందే. అక్కడ ఆయన గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. కాగా.. ఈ సహపంక్తి భోజనంలో ఆయనతోపాటు కలిసి పాల్గొన్న ఆకుల ఆగవ్వ అనే మహిళ అస్వస్థతకు గురైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

 వాసాలమర్రిలో సభ ముగించుకొని ఇంటికి వెళ్లాక ఆగవ్వకు తీవ్ర కడుపునొప్పి రావడంతో భువనగిరి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కడుపునొప్పి పూర్తిగా తగ్గిన తర్వాత గురువారం ఇంటికి పంపారు. ఎండ లో తిరగడంతో ఆమె అస్వస్థతకు గురైందని జిల్లా కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. కాగా, గ్రామంలో దాదాపు 20 మంది సైతం అస్వస్థతకు గురయ్యారని సమాచారం. ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.