పుస్తెలు, మెట్టెలు తీయాల్సిందే... వీఆర్వో పరీక్షా కేంద్రాల్లో అధికారుల ఓవర్ యాక్షన్

తెలంగాణ వ్యాప్తంగా వీఆర్‌వో పోస్టుల భర్తీ కోసం ఇవాళ అభ్యర్థులకు రాత పరీక్ష  జరుగుతోంది. ఈ క్రమంలో మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని పరీక్షా కేంద్రంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

officers over action at VRO Examination center at narasapur

తెలంగాణ వ్యాప్తంగా వీఆర్‌వో పోస్టుల భర్తీ కోసం ఇవాళ అభ్యర్థులకు రాత పరీక్ష  జరుగుతోంది. ఈ క్రమంలో మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని పరీక్షా కేంద్రంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పరీక్షకు హాజరైన మహిళా అభ్యర్థులపై అర్థం లేని ఆంక్షలు పెడుతున్నారు.

వివాహితలైన మహిళా అభ్యర్థులను పుస్తెలు, మెట్టెలు తీస్తేనే పరీక్షకు అనుమతిస్తామని లేదంటే పంపమని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో చాలామంది మహిళలు పరీక్షా కేంద్రం బయటే నిలబడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నేతలు ఎగ్జామ్ సెంటర్ వద్దకు చేరుకుని అధికారుల తీరుకు నిరసనగా పుస్తెలతో ఆందోళన చేపట్టారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios