డాక్టర్ రాలేననడంతో కాన్పు చేసిన నర్సులు.. వికటించడంతో శిశువు మృతి...
ప్రభుత్వాసుపత్రిలో లేడీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులు కాన్పు చేయడంతో ఓ నవజాత శిశువు మృతి చెందిన ఘటన కోదాడలో వెలుగు చూసింది.
కోదాడ : తెలంగాణలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. డాక్టర్ ఆస్పత్రికి రాలేదని నర్సులు కాన్పు చేయడంతో నవజాత శిశువు మృతి చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో వెలుగు చూసింది. కాన్పు వికటించడంతో ఈ దారుణ ఘటన జరిగింది. బంధువులు, కుటుంబసభ్యులు దీనికి సంబంధించి నర్సుల మీద ఆరోపణలు గుప్పించారు. వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. నడిగూడెం మండలం వెంకట రామాపురానికి చెందిన మానస గర్భిణి. నొప్పులు రావడంతో కాన్సు కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు.
మంగళవారం తెల్లవారుజామున ఆమెకు నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు ఆమెను సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడి సిబ్బంది డాక్టర్ కు విషయం చెప్పారు. కానీ ఆమె రాలేనని చెప్పింది. దీంతో నర్సులో కాన్పు చేయాలని నిశ్చయించుకున్నారు. కానీ నిర్లక్షం కారణంగా శిశువు మృతి చెందింది. అయితే, కాన్పు చేసిన నర్సులు.. శిశువు పరిస్థితి ప్రమాదంగా ఉందని.. ప్రైవేట్ ఆస్రత్రికి తీసుకెళ్లాలని హడావుడి చేశారు.
ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లల వైద్యులు కూడా అందుబాటులో లేరు. దీంతో శిశువును ప్రభుత్వాసుపత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. అయితే, అంబులెన్స్ డ్రైవర్ కూడా ప్రైవేట్ ఆస్పత్రికి రానని చెప్పాడు. దీంతో శిశువు మృతి చెందిందని బంధువలు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు.