Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు

హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ఏర్పాటు చేశారు. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా మెట్రో స్టేషన్లలో అద్దెకార్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. 

Now, rent an e-car from Hyderabad Metro station at Rs 40/hour!
Author
Hyderabad, First Published Jun 8, 2019, 8:52 AM IST

హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ఏర్పాటు చేశారు. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా మెట్రో స్టేషన్లలో అద్దెకార్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్లు బ్యాటరీ సహాయంతో నడుస్తాయి. ఈ వాహనాలను మియాపూర్ స్టేషన్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు నడుపుతున్నారు. 

వీటి అద్దె ధర కూడా చాలా చౌకగా అందించడం గమనార్హం. గంటకు కేవలం రూ.40చెల్లిస్తే సరిపోతుంది.  మొట్టమొదటిగా 25 మహీంద్రా కార్లను అందుబాటులోకి తెచ్చిన మెట్రోరైలు అధికారులు దశల వారీగా ఇతర స్టేషన్లకు విస్తరించనున్నారు. 

అయితే వీటిని మియాపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుతోపాటు మాదాపూర్ ప్రాంతాలకు నడుపుతున్నారు. మియాపూర్ మెట్రోస్టేషన్లో దిగిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరడానికి వీటిని ఉపయోగించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. దీనికోసం జూమ్‌కార్‌తో మెట్రోసంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ వాహనాన్ని నడపాలనుకునే ప్రయాణికుడు ముందుగా జూమ్‌కార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్‌ను అప్‌లోడ్ చేయాలి. అనంతరం కార్‌లాక్ అన్‌లాక్ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది. 

యాప్‌లో ఎన్నిగంటలు వాడుకుంటారో ఆప్షన్ సెలక్ట్‌చేసుకొని అందుకు తగినంత మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. పూర్తిస్థాయి జీపీఎస్ సిస్టం కలిగి ఉన్న ఈ కార్లు తాము గమ్యస్థానానికి చేరి పార్కింగ్ చేయగానే లాక్ పడిపోతుంది.  అక్కడి నుండి స్టేషన్‌కు రావాలనుకున్న వ్యక్తులు మళ్లీ దానిని ఉపయోగించుకొనే వీలుంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios