హైదరాబాద్: హైదరాబాద్ లో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు  పోలీస్ శాఖ షాక్ ఇచ్చింది. డిసెంబర్ 3న నిర్వహించబోయే టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు అనుమతి నిరాకరించింది. డిసెంబర్ 3న హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. 

అయితే డిసెంబర్ 3న పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ బహిరంగ సభకు పోలీస్ శాఖ అనుమతి నిరాకరించింది. ఎందుకంటే నేవీ కార్యక్రమాలు ఉండటంతో సభకు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయ వేదికను వెతికే పనలో పడ్డారు.