Asianet News TeluguAsianet News Telugu

నో డిటెన్షన్.. విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్

మళ్లీ స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు తెరుస్తారు అనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ డిగ్రీ విద్యార్థులకు ఓ శుభవార్త తెలియజేసింది. 

No detention system for degree students in Telangana this year
Author
Hyderabad, First Published Apr 24, 2020, 1:30 PM IST

కరోనా వైరస్ కారణంగా  స్కూళ్లు, కాలేజీలు ఎక్కడికక్కడ మూతపడిన సంగతి తెలిసిందే. ఒక్క ఇంటర్ పరీక్షలు మాత్రమే జరిగాయి. కనీసం పదో తరగతి పరీక్షలు కూడా జరగలేదు. అంతలోనే కరోనా మహమ్మారి విలయతాండవం చేయడం మొదలుపెట్టింది. దీంతో సెలవలు ప్రకటించారు.

అయితే.. మళ్లీ స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు తెరుస్తారు అనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ డిగ్రీ విద్యార్థులకు ఓ శుభవార్త తెలియజేసింది. 

పలు యూనివర్సిటీల పరిధిలో సంప్రదాయ డిగ్రీ కోర్సులకు సంబంధించి ఈ ఏడాది డిటెన్షన్ విధానాన్ని తొలగించాలని నిర్ణయించింది. అంటే పరీక్ష ఫలితాలతో సంబంధం లేకుండా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సెకండియర్‌కు, సెకండ్ ఇయర్ విద్యార్థులు, థర్డ్ ఇయర్‌కు వెళ్లొచ్చు. ఆ తర్వాత ఏడాదిలో విద్యార్థులు తమ బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. 

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నియమం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వర్తించదు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు డిగ్రీ పట్టా పొందాలంటే అన్ని పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది. గతంలో ఉన్న నియమ నిబంధనల ప్రకారం విద్యార్థులు పై తరగతికి ప్రమోట్ కావాలంటే 50 శాతం క్రెడిట్స్ ఉండాలి. కానీ ప్రస్తుతం ఈ నియమాలను పక్కన పెట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios