మహారాష్ట్రలో ఏ పార్టీతో పొత్తుండదు: కేసీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్‌లో చేరిక
మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు ఇవాళ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
హైదరాబాద్: మహారాష్ట్రలో ఏ పార్టీతో పొత్తు ఉండదదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తేల్చి చెప్పారు.సోమవారంనాడు మహారాష్ట్రకు చెందిన నేతలు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరారు. మహరాష్ట్రకు నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే విషయమై కేసీఆర్ చర్చించారు. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసే విషయమై నేతలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేశారు.
నాగ్‌పూర్, ఔరంగబాద్, పూణె, ముంబైలలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే మహారాష్ట్రలో కేసీఆర్ మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ను ప్రకటించిన తర్వాత మహారాష్ట్రపై కేసీఆర్ కేంద్రీకరించారు. రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. తెలంగాణలో అమలు చేస్తున్న పధకాలను తమ రాష్ట్రంలో కూడ అమలు చేయాలని డిమాండ్లు కూడా నెలకొన్నాయి. ఈ ప్రాంతాలపై కేసీఆర్ కేంద్రీకరించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా తొలుత మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు.
2024 ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటాలని కేసీఆర్ తలపెట్టారు. ఆయా రాష్ట్రాల్లోని తమ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ స్వంతంగా పోటీ చేయాలని భావస్తుంది. దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు