Asianet News TeluguAsianet News Telugu

ఎంపి అరవింద్ కు షాక్ : చాతగాకపోతే రాజీనామా చేసి ఉద్యమంలో చేరమని డిమాండ్...(వీడియో)

నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం చౌట్ పల్లిలో ఎంపి అభ్యర్థులుగా గత పార్లమెంట్ ఎన్నికలలో నామినేషన్ వేసిన పసుపు రైతుల సమవేశం రసాభసాగా మారింది. ఈ సమావేశానికి హాజరైన ఎంపీ అరవింద్ ను పసుపు రైతులు నిలదీశారు. 

Nizamabad turmeric farmer questions bjp mp aravind over his promises - bsb
Author
Hyderabad, First Published Jan 23, 2021, 3:41 PM IST

నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం చౌట్ పల్లిలో ఎంపి అభ్యర్థులుగా గత పార్లమెంట్ ఎన్నికలలో నామినేషన్ వేసిన పసుపు రైతుల సమవేశం రసాభసాగా మారింది. ఈ సమావేశానికి హాజరైన ఎంపీ అరవింద్ ను పసుపు రైతులు నిలదీశారు. 

"

బోర్డు ఎర్పాటు విషయంలో మోసం చేసారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపి ఆరవింద్ పదవికి రాజినామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో15 వేల మద్దతు ధర ఇప్పిస్తానని నేను చెప్పలేదంటూ ఎంపి అరవింద్ చేతులెత్తేశారు. 

పసుపు మద్దతు 15వేల ధర, పసుపు బోర్డు ఆలస్యం విషయంలో ఎంపీకి రైతుల సూటి ప్రశ్నలు వేశారు. ఎన్నికలైన 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని ఎందుకు తేలేదని ఎంపీని రైతులు నిలదీశారు. 

కనీసం 15 వేల మద్దతు ధర  ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించడంతో, బాండ్ పేపర్ లో నిర్ణీత సమయం, మద్దతు ధర నేను రాసియ్యలేదంటూ ఎంపీ దాటవేశారు. రాసిచ్చిన బాండ్ పేపర్ కు సమాధానం చెప్తావా లేక రాజీనామా చేసి ఉద్యమంలోకి వస్తావా అంటూ రైతులు ఎంపీని హామీల వీడియో చూపిస్తూ మరీ నిలదీశారు. 

దీంతో పసుపు రైతుల సమవేశం నుండి ఎంపి అరవింద్ అర్థాంతరంగా వెళ్లిపోయారు. ఎంపీ తీరుతో ఆగ్రహించిన పసుపు రైతులు ఎంపి డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఎంపీకి బుద్ది చెపుతామని రైతులు హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios