తెలంగాణ కాంగ్రెస్ నేతలపై నిజామాబాద్ ఎంపీ కవిత మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఓటమికి మొన్నటి వరకు ఈవీఎంల ట్యాంపరింగ్‌ అన్నారని...ఇవాళ చంద్రబాబును సాకుగా చూపిస్తున్నారని ఎంపీ కవిత మండిపడ్డారు. 

బుధవారం ఎంపీల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్‌ నేతలు కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో కూటమి హామీలను ప్రజలు విశ్వసించలేదని అన్నారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు.