Asianet News TeluguAsianet News Telugu

కేసీఅర్ కు రెండో కొడుకు రేవంత్ రెడ్డి.. ధర్మపురి అరవింద్...

జీహెచ్ ఎంసీ ఎన్నికలకు రాని కరోనా.. దళిత బంధువుకు వచ్చిందా? హుజూరాబాద్ లో పథకాలు అభివృద్ది జరుగుతుందంటే ఈటల రాజేందర్ వల్లనే. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని జీవో విడుదల చేశావ్. రాష్ట్రంలో కులసంఘలకు ఇస్తా అన్న కమ్యూనిటీ హల్ ల హామీ ప్రోసిడింగ్ ల వరకే ఆగిపోయింది.

Nizamabad MP Dharmapuri Arvind sensational comments on KCR, Rewanth Reddy
Author
Hyderabad, First Published Aug 21, 2021, 2:30 PM IST

నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ మరోసారి కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు. ఇప్పటి నుండి గ్యాప్ లేకుండా కేసీఆర్ ను నిద్ర పోనివ్వం. 25 ఏళ్ళ కింద సిద్దిపేటలో దలిత చైతన్య జ్యోతితో సిద్దిపేట కోటీశ్వరులు అయ్యారా? ఇండియా టుడే సర్వే లో టాప్ టెన్ జాబితాలో ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేరు అన్నారు.

కేసీఆర్ నారుకుడుకు సర్వే పెడితే ప్రపంచ వ్యాప్తం గా ఫస్ట్ వస్తాడు.
తెలంగాణ ట్రాన్స్ కో లక్షాపదివేల కోట్లు అప్పు అయింది. గుజరాత్ లో రూపాయి కమిషన్ లేకుండా ఇంటిటికి నీళ్ళ కార్యక్రమం అయిపోయింది. తెలంగాణలో కమిషన్ లతో నడిచినా ఇంకా నీళ్ళు రావడం లేదన్నారు.

దళితులకు రాజ్యాధికారం ఎందుకు లేదో కేసీఆర్ చెప్పాలి. తెలంగాణ క్యాబినెట్ లో ఒకే ఒక్క దళిత మంత్రి ఉన్నాడు. కేంద్రంలో 12 మంది దళితులు మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రికి హిందువులను తొక్కడానికి ఉన్నాడు.
రాష్ట్రంలో దళితులతో పాటు ఇతర కులాల నిరుపేదలకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జీహెచ్ ఎంసీ ఎన్నికలకు రాని కరోనా.. దళిత బంధువుకు వచ్చిందా? హుజూరాబాద్ లో పథకాలు అభివృద్ది జరుగుతుందంటే ఈటల రాజేందర్ వల్లనే. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని జీవో విడుదల చేశావ్. రాష్ట్రంలో కులసంఘలకు ఇస్తా అన్న కమ్యూనిటీ హల్ ల హామీ ప్రోసిడింగ్ ల వరకే ఆగిపోయింది.

కేంద్రం ఎంఎస్పి వల్లే తెలంగాణలో వరి ఎక్కువ పండుతుంది. గతంలో వర్షాలకు పంట నష్టపోతే ఒక్క రూపాయి నష్ట పరిహారం ఇవ్వలేదు. కేంద్రం ఇస్తున్న పంట భీమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ స్టాల్మెంట్ కట్టడం లేదు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏమయింది? అంబేద్కర్ జయంతి, వర్ధంతికి బయటికి వెల్లాడు. దళితులకు రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే అన్నారు.

ఎన్నికల కమిషన్ ఆలస్యమయితే అన్ని ప్రొసీడింగ్స్ పూర్తి చేసుకొండి. హుజూరాబాద్ లో ఇచ్చిన వాగ్ధానాలు పూర్తయ్యే వరకు మంత్రులను అడ్డుకొండి.
రాబోయే రోజుల్లో కేసీఅర్ కుటుంబం విదేశాలకు పారిపోతుంది. హుజూరాబాద్ నియోజక వర్గం లో రెండు వందల కోట్లు పెట్టీ కొనుగోలు చేసిండు. 2023 వరకు కేసీఅర్ కు రెండో కొడుకు రేవంత్ రెడ్డి అని చెప్పుకొచ్చారు.

యాదవులు గోర్లు కాసుకోమని చెప్పడమే సామాజిక న్యాయమా తన కొడుకు కూతురు కి ఇవ్వాలి గోర్లు. ప్రజలు తిరస్కరిస్తే ఎం ఎల్ సి ఇచ్చి మంత్రిని చేయబోతున్నాడు.
గెలిచే స్థానానికి కొడుకును పంపి.. ఓడిపోయే స్థానానికి అల్లుడు హరీష్ ను పంపి బక్ర చేస్తున్నాడు. పోలీసులు గులాబీ కండువా వేసుకొని పని చేయకండని కొంత మంది పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు.

నిజామాబాద్ లో రోహింగ్యాలకు పాస్పోర్ట్ ఇచ్చిన వాళ్ళ మీద చిన్న చిన్న కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక అటువంటి అధికారుల పనిపడతాం. ముఖ్యమంత్రి కి నిద్ర పట్టడం లేదు. ముఖ్యమంత్రికి అంత ధీమా ఉంటే ఈ ప్రలోభాలు ఎందుకు అన్నారు.

ఈటల రాజేందర్పై పనికి మాలిన కేసులు నమోదు అవుతున్నట్లు సమాచారం. భైంసా లో హిందువులను జైల్లో పెట్టి హింస్తున్నరు. నాగార్జున సాగర్ లో మహిళలను, ప్రజలను కుక్కలు అని దుషించాడు.ఎన్ఆర్ఐ తల్లులను, దండ్రులను దూషించిన ముఖ్యమంత్రి కి టీఆరెఎస్ ఎమ్మెల్లై లు నిలదీయండన్నారు.

కేసీఅర్ పతనం చూసే వరకు నిద్ర పోయేది లేదు 2023 లో టీఆరెఎస్ పార్టీ నీ బొంద పెట్టడం నా కర్తవ్యం. రైతులకు మీటర్లు పెట్టాలని ఎక్కడ చెప్పలేదు. రైతుల ఇండ్లలో కూడా మీటర్లు పెట్టొద్దు. హుజూరాబాద్ బస్ స్టాండ్ కూర్చోండి.. కేంద్రం డ్రాఫ్ట్ బిల్లు లో మీటర్లు బిగించాలని ఎక్కడో ఉందో చుపెట్టు అని ఎద్దేవా చేశారు.

దళితులకు లక్ష డెబ్భై వేల కోట్లు ఇవ్వాలంటే కేసీఅర్ మనువడు ముసలోడు కావలె.
కేంద్రం దొంగ స్కీమ్ లు పెట్టడం లేదు. చేసిన పనులే చెప్పుకుంటూ పాదయాత్రలు చేస్తున్నాం. తెలంగాణ సిఎస్ దొంగ.. కేంద్రానికి అన్ని అబద్దాలు చెపుతున్నాడు  అన్నారు. 

కాళేశ్వరం , మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పూర్తి కావడం ఇష్టం లేదు.
పెట్రోల్ ధర పెరగడనికి రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ వేయడమే కారణం. రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించక కేంద్రానికి లేఖ రాయి నేను కూడా సంతకం పెడుతా అంటూ సవాల్ విసిరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios